HomeTelugu NewsGame Changer: ప్రమోషన్స్ జోరు పెంచనున్న రామ్ చరణ్ "గేమ్ ఛేంజర్‌"..!

Game Changer: ప్రమోషన్స్ జోరు పెంచనున్న రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్‌”..!

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా “గేమ్ చేంజర్”. అయితే ఈ నెల నాలుగో వారం నుంచి ‘గేమ్ ఛేంజర్’ సినిమాను దూకుడుగా ప్రమోట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమోషన్స్‌కి సంబంధించి టీమ్‌ ఇప్పటికే ఓ క్లియర్‌ ప్లాన్‌తో షెడ్యూల్‌ను రూపొందించుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా నుంచి ముందుగా పాటలు, ప్రోమోలను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. సినిమాపై మెగా అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే శంకర్ ఈ సినిమాలో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ పెడుతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img