Homeఫ్లాష్ ఫ్లాష్వేలం పాటలో రూ. 11.82 లక్షలు పలికిన గాంధీ పాకెట్ గడియారం

వేలం పాటలో రూ. 11.82 లక్షలు పలికిన గాంధీ పాకెట్ గడియారం

న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ వాడిన పాకెట్ గడియారం బ్రిటన్‌లో జరిగిన ఒక వేలం పాటలో 11,82,375 రూపాయలకు (12,000 పౌండ్లు) అమ్ముడుపోయింది.

1944లో ఒక వ్యక్తి తన పట్ల చూపిన ప్రేమకు కృతజ్ఞతగా గాంధీ ఈ వాచీని ఇచ్చారు. ఆ వ్యక్తి మనవడు తాజాగా వాచీని వేలానికి పెట్టాడు.

ఈ వాచీ 10,000 పౌండ్లు (9,85,313 రూపాయిలు) వరకు విలువ చేస్తుందని అంచనా వేశారు. కానీ, ఈస్ట్ బ్రిస్టల్‌లో శుక్రవారం జరిగిన వేలం పాటలో అంచనాకు మించిన ధర వచ్చింది. అమెరికాకు చెందిన ఒక వ్యక్తి దీనిని దక్కించుకున్నారని వేలం వేసిన ఆండ్రూ స్టో చెప్పారు.

ఆగస్టులో గాంధీ ధరించిన కళ్ళద్దాలను వేలం వేయగా రూ. 2,56,18,140 (2,60,000 పౌండ్లు) ధర పలికాయి.

ఈ గడియారం ఒకప్పుడు గాంధీ అనుచరుడైన మోహన్ లాల్ శర్మ అనే ఒక వడ్రంగిది. 1936లో ఆయన గాంధీ వద్దకు వెళ్లి స్వచ్ఛందంగా సేవలు అందించారు.

ఆయన చూపిన ప్రేమకు కృతజ్ఞతగా గాంధీ ఈ పాకెట్ గడియారాన్ని 1944లో ఆయనకు బహూకరించారు. 1975లో ఆయన ఆ గడియారాన్ని తన మనుమడికి ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img