Homeతెలంగాణగాంధీ నుంచి క‌రోనా ఖైదీలు ప‌రారీ

గాంధీ నుంచి క‌రోనా ఖైదీలు ప‌రారీ

హైద‌రాబాద్ః గాంధీ ఆస్ప‌త్రిలో క‌రోనా చికిత్స పొందుతున్న 4 ఖైదీలు గురువారం తెల్ల‌వారుజామున త‌ప్పించుకున్నారని పోలీసు అధికారులు వెల్ల‌డించారు. చ‌ర్ల‌ప‌ల్లి జైలులో శిక్ష అనుభ‌విస్తున్న వీరికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో మెరుగైన చికిత్స అందించేందుకు వీరిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. గాంధీ ఆస్ప‌త్రి ప్ర‌ధాన భ‌వ‌నం రెండో అంత‌స్తులోని బాత్రూమ్ గ్రిల్స్ తొగించి ప‌రారు అయ్యారు. గాంధీలో మొత్తం 10 మంది ఖైదీలు చికిత్స పొందుతున్న‌ట్లు వీరిలో 4గురు పారిపోయారని చ‌ర్ల‌ప‌ల్లి జైలు సూప‌రింటెండెంట్ సంప‌త్ తెలిపారు. పారిపోయిన ఖైదీల‌ను ప‌ట్టుకునేందుకు ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img