విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై 10మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.ఘటనలో పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మైనర్ యువతిని ఓ యువకుడు ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా బాలికను బెదిరించి అతడి ఫ్రెండ్ చేత అత్యాచారం చేయించాడు. ప్రియుడు మోసం చేయడంతో తట్టుకోలేకపోయిన బాలిక.. సూసైడ్ చేసుకునేందుకు బీచ్‌కు వెళ్లింది. అక్కడ బాలికను గమనించిన బీచ్ ఫొటో గ్రాఫర్.. ఆమెను ట్రాప్ చేసి రూమ్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడితో మరో 10 మంది వరకు వేర్వేరు హోటళ్లు, లాడ్జీల్లో బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.
దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాలిక ఇంట్లో నుండి పారిపోయింది. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు బాలిక జాడ కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే, ఇంట్లో నుండి ఎందుపారిపోయావని తల్లిదండ్రులు నిలదీయడంతో బాలిక అసలు విషయం చెప్పంది. దీంతో బాధితురాలి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలో విచారణ మొదలుపెట్టారు. ఇప్పటి వరకు కొందరిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇక, రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ కేసును విశాఖ సీపీ దిశ పోలీసులకు అప్పగించారు.