టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా యంగ్ హీరోయిన్ నేహా శెట్టి హీరోయిన్గా దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.ఈ సినిమాకు సంబంధించి గతంలో రిలీజైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మేకర్స్ మూవీ రిలీజ్ డేట్‌ను మొదట డిసెంబర్ 8కి ఫిక్స్ చేశారు. అయితే, ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ చేసిన లేటెస్ట్ పోస్ట్ ఒకటి షాకింగ్ అండ్ కాంట్రవర్సియల్ మారిన సంగతి తెలిసిందే. ఈ డిసెంబర్లో సినిమా రిలీజ్ లేకపోతే ఒక్క ప్రమోషన్స్‌లో కూడా కనిపించను అని విశ్వక్ సేన్ తెగేసి చెప్పేసాడు. దీంతో సినిమా పోస్ట్ పోన్ అనేది ఆల్ మోస్ట్ కన్ఫార్మ్ కాగా ఇప్పుడు ఈ పోస్ట్ పోన్‌పై స్ట్రాంగ్ బజ్ అయితే వినిపిస్తోంది. ఈ మూవీ డిసెంబర్ నెలలోనే రిలీజ్ కానుందని.. 29వ తేదీని లాక్ చేసినట్లుగా సమాచారం. దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.