దర్శకుడు కృష్ణచైతన్య దర్శకత్వలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. ఈ చిత్రంలో నేహాశెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ పాత్ర హై వోల్టేజ్ వైబ్రేషన్స్ ఇస్తుంది. పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్స్ పై చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగే ఓ సామాన్య యువకుడి కోణంలో ఈ కథ సాగుతుందని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. దీనిని కూడా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది.