Homeహైదరాబాద్latest News'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్విట్టర్ రివ్యూ.. విశ్వక్ సేన్ నట విశ్వరూపం.. సినిమా ఎలా ఉందంటే?

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ట్విట్టర్ రివ్యూ.. విశ్వక్ సేన్ నట విశ్వరూపం.. సినిమా ఎలా ఉందంటే?

విశ్వక్‌సేన్ హీరోగా.. అంజలి, నేహాశెట్టి హీరోయిన్లుగా కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ సినిమా ట్విట్టర్ టాక్ ఎలా ఉందొ తెలుసుకుందాం..గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి మాస్ ఫీస్ట్ అని విశ్వ‌క్‌సేన్ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. లంక గ్రామాల్లోని హింస‌పై పోరాడిన ఓ యువ‌కుడి క‌థ‌తో ద‌ర్శ‌కుడు కృష్ణ చైత‌న్య ఈ మూవీని తెర‌కెక్కించిన‌ట్లు చెబుతున్నారు.. విశ్వ‌క్‌సేన్ వాయిస్ ఓవ‌ర్‌తోనే ఈ మూవీ ఇంట్రెస్టింగ్‌గా ప్రారంభ‌మ‌వుతుంద‌ని అంటున్నారు. ఫ‌స్ట్ యాక్ష‌న్ ఎపిసోడ్‌తో పాటు మిగిలిన ఇంట‌ర్వెల్‌ ఫైట్ సీక్వెన్స్‌లు అదిరిపోయాయ‌ని కామెంట్స్ చేస్తున్నారు. ఆడు మొద‌టి మూడు పోట్లు అమ్మోరికి వ‌దిలేశాడు అయ్యా…లాంటి డైలాగ్స్ థియేట‌ర్ల‌లో విజిల్స్ ప‌డ‌తాయ‌ని ఓ నెటిజ‌న్ ట్వీట్ చేశాడు.

కామెడి, యాక్ష‌న్‌, మిక్స్‌డ్‌గా లంక‌ల‌ ర‌త్న పాత్ర‌లో విశ్వ‌క్‌సేన్ యాక్టింగ్ బాగుంద‌ని నెటిజ‌న్లు చెబుతోన్నారు. విశ్వ‌క్ సేన్‌లోని మాస్ కోణాన్ని కొత్త యాంగిల్‌లో చూపించిన సినిమా ఇద‌ని అంటున్నారు. . బుజ్జి పాత్రలో నేహాశెట్టి న‌ట‌న బాగుంద‌ని, ప‌ల్లెటూరి అమ్మాయి పాత్ర‌లో ఆమె చూపించిన వేరియేష‌న్స్ ఆక‌ట్టుకుంటాయ‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

యువ‌న్ శంక‌ర్ రాజా బీజీఎమ్ సినిమాకు ప్రాణం పోసింద‌ని ఓ నెటిజ‌న్ ట్వీట్ చేశాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి కోసం ద‌ర్శ‌కుడు కృష్ణ చైత‌న్య ఎంచుకున్న పాయింట్ బాగుంద‌ని చెబుతోన్నారు. రేసీ స్క్రీన్‌ప్లేతో ఎలాంటి ల్యాగ్ లేకుండా సినిమాను న‌డిపించాడ‌ని అంటున్నారు. రా అండ్ ర‌స్టిక్‌గా ఈ మూవీ సాగుతుంద‌ని, బ్యాక్‌డ్రాప్‌, మాస్ డైలాగ్స్ బాగున్నాయ‌ని ట్వీట్స్ చేస్తున్నారు. ఫైనల్ గా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఒక మాస్ ఫీస్ట్.. విశ్వ‌క్‌సేన్ నట విశ్వరూపం చూపించాడు అని నెటిజ‌న్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img