గంజాయి వ్యాపారం కోసం కేటుగాళ్లు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నారు. హ్యాష్ ఆయిల్, చాక్లెట్లుగా మార్చి అమ్మే విధానం పోయి ఇప్పుడు పౌడర్ ద్వారా మిల్క్‌షేక్‌గా రూపాంతరం చెందిస్తున్నారు. తాజాగా జగద్గిరిగుట్టలోని ఓ కిరాణా దుకాణంలో గంజాయి పౌడర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పౌడర్‌ను పాలల్లో కలిపి మిల్క్‌షేక్‌గా తాగుతారట. ప్రస్తుతం ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది. తల్లిదండ్రులు పిల్లల కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.