Homeహైదరాబాద్latest Newsకొలంగూడలో గంజాయి స్వాధీనం

కొలంగూడలో గంజాయి స్వాధీనం

ఇదే నిజం, కొమురం భీం ఆసిఫాబాద్ : జైనూర్ మండలం లోని గౌరీ గ్రామపంచాయతీలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొలంగూడ కు చెందిన ఆత్రం భీంరావు ఇంటి వద్ద దాదాపు 3 కేజీ ల గంజాయిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించినట్టు జైనూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజయ్య తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. ఎస్ఐ సందీప్ కుమార్, సిబ్బంది , డిప్యూటీ తహసీల్దార్ గౌరి గ్రామంలోని కొలంగూడ కు వెళ్లి తనిఖీలు చేశారు. ఆత్రం బీంరావు అనే వ్యక్తి ఇంటిలో సోదాచేయగా 3 కేజీ ల ఎండు గంజాయి లభించింది. తన వ్యవసాయ భూమిలో పత్తి పంటతో సహా గంజాయి మొక్కలను పెంచి అమ్ముతున్నట్లు తెలిసింది.

ఈ సందర్బంగా జైనూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజయ్య మాట్లాడుతూ.. యువత చెడు అలవాట్లకు అలవాటు కావద్దు అని కోరారు. తల్లి తండ్రులు పిల్లల ను గమనిస్తూ ఉండాలి అని సూచించారు. గంజాయి సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలన్నారు. వివరాలు గోప్యం గా ఉంచుతాం అని చెప్పారు. గంజాయి పండించినా , అమ్మినా, రవాణా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి నిర్ములన లో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యం కావాలి అని కోరారు.

Recent

- Advertisment -spot_img