ఇదేనిజం, ఖానాపురం : బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన గంట రవికుమార్‌ను శుక్రవారం ఖానాపూర్ మండల అధ్యక్షుడు ఆబోతు రాజు యాదవ్, ఖానాపూర్ మండల ఇన్చార్జి గడ్డం ఆంజనేయులు, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు సుదర్శన్, జిల్లా కార్యదర్శి శివకుమార్, నల్లబెల్లి మండల ప్రధాన కార్యదర్శి రమేశ్ తదితరులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.