Get hungry right after eating: ఆకలి అనేది ఒక సహజ ప్రక్రియ కానీ తిన్న వెంటనే మళ్ళీ ఆకలిగా అనిపిస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్య కాలంలో చాలా మంది డైట్ పేరుతో తక్కువ మోతాదులో ఆహారం తింటున్నారు. అయితే, శరీరంలో స్ట్రెచ్ రెసెప్టార్స్ ఉంటాయని.. ఇవి మీరు తీసుకున్న ఆహారం పరిమాణం బట్టే కడుపు నిండిందా లేదా అన్న అంచనాకి వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. కడుపు నిండినట్లు అనిపించకపోతే మెదడుకి ఆకలి సంకేతాలను పంపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, కడుపు నిండా తినాలని.. కాకపోతే కెలోరీలు తక్కువ ఉండేలా చూసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు.
ALSO READ: Health: చిన్నారులకు చికెన్, మటన్ లివర్ తినిపిస్తున్నారా? అయితే సమస్యలు వచ్చే ప్రమాదం..!