Homeఫ్లాష్ ఫ్లాష్#GHMC లో సైలెంట్ వేవ్.. భారీగా ఓట్ షేర్ పెంచుకున్న బీజేపీ

#GHMC లో సైలెంట్ వేవ్.. భారీగా ఓట్ షేర్ పెంచుకున్న బీజేపీ

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల ప్రకారం అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మరోసారి సొంతంగా మేయర్‌ పీఠం చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

దుబ్బాక విజయంతో జోరు మీదున్న బీజేపీ గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోని ప్రచారం చేసింది. పార్టీ అంతా ప్రచారం భాగస్వామ్యం అయింది.

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హైదరాబాద్ బల్దియా ఎన్నికల్లో ప్రచారం చేశారు.

అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ సఫలం అయినట్లు ఎగ్జిట్ ఫోల్స్ ఫలితాలను బట్టి తెలుస్తోంది.

గ్రేటర్ సైలెంట్ వేవ్ పనిచేసింది. దీంతో పలు డివిజన్లలో బీజేపీకే గణనీయమైన ఓట్ షేర్ వచ్చేలా చేసిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య ఆరు శాతం ఓట్ల వ్యత్యాసం ఉండటం గమనార్హం.

ఫలితం ఇచ్చిన వ్యూహం

బీజేపీ ఏకకాలంలో రెండు పార్టీలను ధీటుగా ఎదుర్కొని ప్రచారం చేసింది. పాలబస్తీలో మజ్లిస్ ని టార్గెట్ చేయడంతోపాటు న్యూ సిటీలో అధికార పార్టీని టార్గెట్ చేస్తూ ప్రచార వ్యూహాం రూపొందించింది.

ముఖ్యంగా బండి సంజయ్ మజ్లిస్ పై చేసిన సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలు యూత్ ని బాగా అట్రాక్ట్ చేశాయి. మజ్లిస్ నేతల్లో ఒత్తిడి పెంచి వారు నోరు జారేలా చేయడంలో సఫలం అయ్యారు.

యూపీ సీఎం యోగితోపాటు పలువురు కేంద్ర మంత్రలు పాతబస్తీపై నజర్ పెట్టి ప్రచారం చేయడంతో మజ్లిస్ నేతలు ఈసారి ప్రచారంలో చెమటోడ్చాల్సి వచ్చింది.

గ్రేటర్ పరిధిలో టీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపెట్టింది. ముఖ్యంగా 2016 ఎన్నికల మెనిఫెస్టోలో ని అంశాలను లేవనెత్తడంతోపాటు 100 గ్రేటర్ ప్రణాళిక లోపాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో బీజేపీ ఓట్ షేర్ పెరిగింది.

రాజకీయ మార్పురే సంకేతం

సహజంగానే అధికార పార్టీపై ఆగ్రహాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకోవడంలో బాగానే సక్సెస్‌ అయ్యిందని చెప్పవచ్చు. దాంతో బీజేపీ బల్దియాలో భారీగా ఓటు శాతాన్ని పెంచుకుంది.

ఇక సిట్టింగ్‌ కార్పొరేటర్లపై ప్రజల్లో భారీగా ఆగ్రహం ఉన్నట్లు ఓట్ల శాతాన్ని బట్టి అర్థమవుతోంది. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణలో భారీ రాజకీయ మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు గ్రేటర్‌ ఎన్నికలు రుజువు చేశాయి.

గ్రేటర్ దాదాపు కాంగ్రెస్, టీడీపీ రెండు పార్టీలు తుడుచుకుపెట్టుకుపోయినట్లు ఎగ్జిట్ పోల్స్ సరళిని బట్టి తెలుస్తోంది. ఈ రెండు పార్టీల అభ్యర్థులు ఫలితాలపై ముందుగానే అంచనాకు వచ్చి డివిజన్లలో ప్రచారమే చేయకపోవడం గమనార్హం.

ఇక టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయం బీజేపీ అనే భావన ప్రజల్లో బలంగానే నాటుకుపోనుంది. ఇక బీజేపీ ఇదే జోష్‌ కొనసాగిస్తే.. తెలంగాణలో పార్టీ పుంజుకునే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎగ్జిట్ పోల్స్ సరళి

జన్ కీ బాత్
టీఆర్ఎస్ – 74 (-7/+3) ఓట్ షేర్ (37.4శాతం)
బీజేపీ – 31 (+11/-7) ఓట్ షేర్ (33.6 శాతం)
ఎంఐఎం – 40 (-1/+3) ఓట్ షేర్ (21శాతం)
ఇతరులు – 5 (-3/-1) ఓట్ షేర్ (3.8 శాతం)

ఆరా సర్వే
టీఆర్ఎస్ – 78 (+/-7) ఓట్ షేర్ (40.08శాతం)
బీజేపీ – 28 (+/-5 ) ఓట్ షేర్ (31.21 శాతం)
ఎంఐఎం – 41 (+/-5) ఓట్ షేర్ (13.43 శాతం)
కాంగ్రెస్ – 3 (+/-3) ఓట్ షేర్ (8.58 శాతం)
ఇతరులు – 0 ( ) ఓట్ షేర్ (7.70 శాతం)

Recent

- Advertisment -spot_img