నెయిల్ పాలిష్ ఆరోగ్యం పై తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫార్మాల్డిహైడ్, డిప్రోపైల్ థాలేట్, అక్రిలేట్స్, టోలున్ వంటి హానికరమైన రసాయనాలు దీనిలో ఉంటాయి. ఇవి శరీరంలోకి చేరడం ద్వారా సంతానోత్పత్తి, శ్వాసకోశ, క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నెయిల్ పెయింట్ లోపల అక్రిలేట్స్ అనే ప్రమాదకరమైన రసాయనం ఉంటుంది. దీని వల్ల చర్మ క్యాన్సర్ వస్తుంది. తద్వారా క్యాన్సర్కు కారణమయ్యే అవకాశాలను పెంచుతుంది.