– ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చాలా రోజల తర్వాత తన మనసులోని మాటను బయటపెట్టారు. తనకు హోంశాఖ బాధ్యతలు అప్పజెపితే బీఆర్ఎస్ లీడర్లకు చుక్కలు చూపిస్తానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లీడర్లు ఎగిరెగిరి పడుతున్నారని.. ఒక్కసారి తనకు హోం మంత్రి పదవి ఇస్తే బీఆర్ఎస్ నేతలను లోపల వేస్తానంటూ వ్యాఖ్యానించారు. భువనగిరి ఎంపీ టికెట్ ఎవరికిచ్చినా తాము సపోర్ట్ చేస్తామన్నారు. తమ ఫ్యామిలీ నుంచి ఎవరూ ఎంపీ టికెట్ ఆశించడం లేదని చెప్పారు. ఒకవేళ అధిష్ఠానం ఆదేశిస్తే కచ్చితంగా పోటీచేస్తామని చెప్పారు.