Homeహైదరాబాద్latest Newsఇసుక వాడుకొనేందుకు పర్మిషన్​ ఇవ్వండి

ఇసుక వాడుకొనేందుకు పర్మిషన్​ ఇవ్వండి

ఇదే నిజం, చేర్యాల: సిద్దిపేట జిల్లా ఆకునూరు గ్రామ పరిధిలోని పెద్దవాగు ఇసుకను గ్రామస్తులు అందరూ వాడుకొనేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీపీఐ నేతలు డిమాండ్​ చేశారు. ఈ మేరకు పెద్దవాగు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం చేర్యాల తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్, ఎంపీటీసీ సుంకరి శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ.. ఆకునూరు గ్రామ పెద్ద వాగులో ఇసుకను గ్రామ ప్రజల అవసరాల కోసం పూర్వం నుంచి ఇంటి నిర్మాణాలకు, దేవాలయాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు, ఇతర అవసరాల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినియోగించుకుంటున్నామని చెప్పారు. కానీ ఇటీవల అనుమతులు లేకుండా కొందరు ఇసుక తరలిస్తున్నారన్న ఓ ట్రాక్టర్ ను టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకొని కేసులు పెట్టి ఇసుక రవాణాను నిలిపివేయడంతో అప్పటి నుంచి ఇసుకను తీసుకెళ్లనివ్వడం లేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో ఆకునూరు పెద్ద వాగు పరిరక్షణ కమిటీ నాయకులు బోయిని బాలయ్య, పుల్లని వేణు, అందే నాని బాబు, కడారి నరేష్, కన్నబోయిన శ్రీనివాస్, కోయినేని నర్సయ్య, ఎర్ర అశోక్, కడారి పరశురాములు, శెట్టే మల్లయ్య, కడారి బాలయ్య, చిగుళ్ల పోచయ్య, కడారి నరేష్, కడారి రాజు, మాద పరుశరాములు, అమరగొండ నర్సింహులు, అమరగొండ మల్లేశం, తోకల వెంకటేష్, కోయినేని శ్రీనివాస్, ఎండీ. అక్బర్, తోట శ్రీనివాస్, సూర్ణ సాయిలు, మాధ ఐలయ్య, అమరగొండ అయ్యల్లం, సిరిగిరి రాజు, గోనెపల్లి మల్లేశం, సుంకరి బాబురాజు, తోట శ్రీనివాస్, తాటికొండ రాజయ్య, కడారి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img