తెలంగాణలో జరుపుకునే పూల పండుగ బతుకమ్మ వేడుకలు కెనడాలోని హాలిఫ్యాక్స్ నగరంలో ఘనంగా నిర్వహించారు. మ్యారిటైం తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరొక్కతీరు పూలతో అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులు అంతా ఒకచోట చేరి జరుపుకున్నారు. మహిళలు, చిన్నారులు సాంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకున్నారు. తెలుగు ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనడం పట్ల అసోసియేషన్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.