Homeహైదరాబాద్latest Newsచిరంజీవికి గోల్డెన్ వీసా..అభినందనల వెల్లువ

చిరంజీవికి గోల్డెన్ వీసా..అభినందనల వెల్లువ

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్నారు. ఇంతకుముందు రజినీకాంత్, షారుక్ ఖాన్, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలాపాల్ తదితరులకు లభించింది. ఇటీవలే పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న చిరంజీవికి తాజాగా గోల్డెన్ వీసా రావడంతో అభిమానులు పెద్దయెత్తున సంబరాలు చేసుకుంటున్నారు. విధ రంగాల్లో విశేష కృషి చేసిన పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు, నటులు, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు పదేళ్ల కాలపరిమితితో ఈ వీసాను ఇస్తారు.

Recent

- Advertisment -spot_img