మీరు ఎక్కువ కాలం చెల్లుబాటుతో ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే.. వినియోగదారులు తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం చెల్లుబాటుతో ఉంచేలా BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ఆకట్టుకుంటోంది. అయితే BSNL రూ.797 ప్రీపెయిడ్ ప్లాన్‌లో కస్టమర్‌లు 300 రోజుల పూర్తి వ్యాలిడిటీని పొందుతారు. ఈ ప్లాన్ రోజువారీ ఖర్చు దాదాపు రెండున్నర రూపాయలే. ఈ ప్రయోజనాలన్నీ మొదటి 60 రోజులకు మాత్రమేనని సిమ్ మాత్రం 300 రోజులు యాక్టివ్‌గా ఉంటుందని BSNL సంస్థ పేర్కొంది.