ఎన్నికల వేళ జగన్ సర్కారు ఏపీ నిరుద్యోగులకు శుభవార్త మోసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈమేరకు సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ డీఎస్సీ నోఫికేషన్ ను విడుదల చేశారు. ఇందుకు సంబంధించి 11, 12 జీవోలను కూడా ఆయన విడుదల చేశారు. డీఎస్సీ 2024 సంబంధించిన వెబ్ సైట్ http//cse.gov.in కూడా మంత్రి ప్రారంభించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూటషన్ సొసైటి,ఎపి ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ, (గురుకులం),ఎపి ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ (ఆశ్రమ్),ఎపి సోషల్ వెల్పేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసేటీ,మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సొసైటీల కింద పనిచేస్తున్న విద్యాసంస్థల్లోని ఖాళీలన్నిటి భర్తీ చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు.