Homeహైదరాబాద్latest NewsRythu Bharosa: రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై అధికారుల కీలక ప్రకటన..!

Rythu Bharosa: రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై అధికారుల కీలక ప్రకటన..!

Rythu Bharosa: తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఖాతాల్లో డబ్బు జమ చేయడానికి సిద్ధంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకం ఎమ్మెల్సీ కోడ్ కారణంగా పలు జిల్లాల్లో నిలిచిపోయింది. ఈ మేరకు రైతు భరోసా సొమ్ము రైతుల ఖాతాలో జమ చేయడంలో ఆలస్యమవుతోంది. ఈ విషయమై లబ్దిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు మరోమారు స్పష్టం చేశాయి. కోడ్ ముగియగానే వారి ఖాతాల్లో రైతు భరోసా కింద తొలివిడత రూ.6000 జమ అవుతాయని స్పష్టం చేశాయి. మార్చి 31 వరకూ నిధుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పాయి.

ALSO READ: PM Kisan Yojana : రైతులకు శుభవార్త.. ”పీఎం కిసాన్ యోజన” పై బిగ్ అప్డేట్..!

Recent

- Advertisment -spot_img