Homeహైదరాబాద్latest Newsగ్రూప్​ 1 అభ్యర్థులకు గుడ్​ న్యూస్​

గ్రూప్​ 1 అభ్యర్థులకు గుడ్​ న్యూస్​

వయో పరిమితి పెంపు

గ్రూప్​1 అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. వయో పరిమితిని పెంచింది. వయో పరిమితిని 46 ఏండ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. ‘కొన్ని నిబంధనల వల్ల టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన ఆలస్యమైంది. నలుగురి ఉద్యోగాలు పోయిన దుఃఖంలో విపక్ష నేతలు 2లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. జిరాక్స్‌ సెంటర్లలో ప్రశ్నపత్రాలు విక్రయించి ఉద్యోగాలు భర్తీ చేసే వాళ్లం కాదు. ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకొని ఉద్యోగాలు అమ్ముకునే వాళ్లం కాదు. పోలీసు ఉద్యోగాల కోసం యువత ఎంతోకాలం నిరీక్షించారు. త్వరలోనే పోలీసు శాఖలో 15వేల ఉద్యోగ నియామకాలు చేపడతాం. యూనివర్సిటీలలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలంటే నిర్దిష్ట విధానం ఉంటుంది’’ అని సీఎం తెలిపారు.

Recent

- Advertisment -spot_img