Homeహైదరాబాద్latest NewsIndiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. వారికీ చెక్కుల పంపిణీ..!

Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. వారికీ చెక్కుల పంపిణీ..!

Indiramma Illu: తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ఉన్న నోవాటెల్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో చెక్కుల పంపిణీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటి విడతగా లబ్ధిదారులకు రూ. 1 లక్ష విలువైన చెక్కులు అందజేయబడ్డాయి. ఈ పథకం కింద, గతంలో కేసీఆర్ ప్రభుత్వం కట్టించిన లక్షన్నర డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పునరుద్ధరించి, అర్హులైన పేదలకు కేటాయించేందుకు ప్రణాళిక సిద్ధం చేయబడింది. ఈ ఇళ్లను పెయింట్ వేసి, ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద పంపిణీ చేస్తున్నారు. సొంత జాగా లేని అర్హులకు ఈ ఇళ్లను కేటాయించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రెండో జాబితా లబ్ధిదారుల ఎంపిక కోసం ఏప్రిల్ 15 నుండి 23 రోజుల పాటు ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.

Recent

- Advertisment -spot_img