తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈరోజు 2023-24 విద్యా సంవత్సరంలో చివరి పనిదినం. ఈ రోజు 1-9వ తరగతి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. 2024-25 విద్యా సంవత్సరంలో జూన్ 12 నుండి పాఠశాలలు పునఃప్రారంభించబడతాయి. విద్యార్థులకు 48 రోజుల పాటు వేసవి సెలవులు ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.