Homeహైదరాబాద్latest Newsఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు..!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు..!

ఏపీ ప్రజలకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయబోతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దీపావళి కానుకగా ఆ రోజు నుంచి రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయబోతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పలు సందర్భాల్లో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద అర్హులకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img