ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ తన యూజర్ల కోసం రోజుకో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. తాజాగా ‘వాయిస్ ట్రాన్‌స్క్రిప్షన్’ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతానికి ఇంగ్లిష్, హిందీతో పాటు స్పానిష్, పోర్చుగీసు, రష్యన్ భాషలకు ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా మనకు వచ్చిన వాయిస్ మెసేజ్ టెక్ట్స్ రూపంలో కనిపిస్తుంది. కాగా, వాట్సాప్ వెబ్ వెర్షన్‌లో ఈ ఆప్షన్ ఉండదు.