రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణంపై కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆగస్టు 15నుంచి ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్వీట్ చేశారు. కూటమి సర్కార్ అధికారంలో వస్తే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది.