తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో పథకం అమలుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మహిళలకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పనుంది. మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం అందించే పథకం అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాల రూపకల్పనపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించినట్లు తెలుస్తుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే ప్రకటన చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.