Homeహైదరాబాద్latest NewsGOOD NEWS...తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

GOOD NEWS…తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్​ ధరను రూ.30.50 వరకు తగ్గించాయి. దీంతో దిల్లీలో దీని ధర రూ.1764.50కు చేరుకుంది. అలాగే 5 కేజీల ఎఫ్​టీఎల్ సిలిండర్ ధర కూడా రూ.7.50కు తగ్గింది. తగ్గిన ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. నేటి నుంచి (ఏప్రిల్ 1)కొత్త ఆర్థిక ఆర్థిక సంవత్సరం మొదలైంది. దీంతో అనేక కొత్త ఆర్థిక నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇక సాధారణంగా ప్రతినెలా ఒకటో తేదీన, 15వ తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయన్న సంగతి తెలిసిందే. సిలిండర్​ ధరలను పెంచడం లేదా తగ్గించడం లేదా స్థిరంగా ఉంచడం లాంటి నిర్ణయాలు తీసుకుంటాయి.


వాణిజ్య గ్యాస్ ధరలు దేశంలోని ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే?

కోల్​కతా రూ.1879
ముంబై రూ.1717
చెన్నై రూ.1930
హైదరాబాద్​ రూ.2027 ఉండేది. ఇప్పుడు దీనిపై రూ.30.50 తగ్గింది.

రెండుసార్లు తగ్గిన దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధరలు:
పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రభావం నుంచి సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు, కేంద్ర ప్రభుత్వం గత 6 నెలల్లో దాదాపు రెండుసార్లు ఎల్​పీజీ సిలిండర్ల ధరలను తగ్గించింది. గత మార్చి 9వ తేదీన ప్రభుత్వం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 తగ్గించింది. అలాగే రక్షాబంధన్ సందర్భంగా డొమెస్టిక్ ఎల్​పీజీ సిలిండర్ల ధరను రూ.200 తగ్గించింది.

Recent

- Advertisment -spot_img