రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటలు ఎండిపోయి..భూగర్భ జలాలు అడుగంటుతున్న తరుణంలో వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది వర్షపాతం అధికంగా నమోదవుతుందని పేర్కొంది. జులై నాటికి నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరిస్తాయని తెలిపింది. సగటు వర్షపాతం 106 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు నివేదించింది. ప్రస్తుతం కరవుతో అల్లాడుతున్న కొన్ని ప్రాంతాలకు ఊరట లభించినట్లయింది.