తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ రూపొందించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం యాప్ను పరిశీలించిన మంత్రి.. పలు సూచనలు చేశారు. యాప్లో తెలుగు వెర్షన్ ఉండేలా చూడాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తామన్నారు.