Homeహైదరాబాద్latest Newsగుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..!

గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..!

దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను చమురు కంపెనీలు తగ్గించాయి. ఒక్కో సిలిండర్‌పై రూ.19 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. తగ్గించిన కమర్షియల్ సిలిండర్ల కొత్త రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. మరో వైపు గృహ అవసరాల నిమిత్తం వినియోగించే LPG గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రతి నెలా ఒకటవ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను చమురు కంపెనీలు సవరిస్తుంటాయి.

Recent

- Advertisment -spot_img