Homeహైదరాబాద్latest Newsగుడ్ న్యూస్.. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఫ్రీగా చూడొచ్చు!

గుడ్ న్యూస్.. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఫ్రీగా చూడొచ్చు!

టీ20 ప్రపంచకప్ మరో 16 రోజుల్లో ప్రారంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఈ మహా యుద్ధానికి ఆతిథ్యమిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మొత్తం 20 దేశాల మధ్య టీ20 ప్రపంచకప్ జరగనుంది. జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. టీమ్ ఇండియా తమ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లన్నీ అమెరికాలో ఆడనుంది. అయితే క్రికెట్ అభిమానులకు డిస్నీ హాట్‌స్టార్ శుభవార్త చెప్పింది. టీ20 ప్రపంచకప్‌ను మొబైల్‌లో ఉచితంగా వీక్షించవచ్చని వెల్లడించింది. ఫోన్‌లో వీక్షించడానికి ఎటువంటి రుసుము లేదు. బాలీవుడ్ ప్రముఖ నటుడు కార్తీక్ ఆర్యన్‌తో ఉచిత పోస్టర్‌ను విడుదల చేసింది హాట్ స్టార్. ‘ఫ్రీ ఫర్ ఆల్.. హర్ మ్యాచ్ హర్ బాల్’ అని క్యాప్షన్‌గా రాసి ఉంది. అయితే క్రికెట్ అభిమానులకు డిస్నీ హాట్‌స్టార్ ఈ శుభవార్త చెప్పింది.

Recent

- Advertisment -spot_img