Homeహైదరాబాద్latest Newsబంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ఖండిస్తూ గూడెం గ్రామస్తులు నిరసన ర్యాలీ

బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ఖండిస్తూ గూడెం గ్రామస్తులు నిరసన ర్యాలీ

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం, గూడెం గ్రామంలో.. గ్రామస్తులు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ ఐక్యవేదిక అధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టి, హిందువులపై దాడులను అక్కడి ప్రభుత్వం వెంటనే అరికట్టాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితుడు మాట్లాడుతూ.. బంగ్లాదేశ్లో హిందువుల దేవాలయాలు, మహిళల పై దాడులు అమానుషమని ఆయన అన్నారు. ఈ దాడులను తీవ్రస్థాయిలో ఖండించారు. భారత దేశ ప్రజలు కులమతాలకు అతీతంగా ఉండి దాడులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక సభ్యులు వెన్నెల రుద్రమణి, అంజన్ రావు, చిట్టినేని శ్రీనివాసరావు, జిల్లెల్ల మల్లేశం, రవి, తాటిపెళ్లి బాబు, బెదురు ప్రశాంత్, శ్రావణ్, బొప్ప వెంకటరమణ, అల్వాల రవి, డాక్టర్ రాములు, పరశురాములు, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img