Homeఫ్లాష్ ఫ్లాష్GOOGLE: గూగుల్ డూడుల్‌గా ‘పానీపూరి’

GOOGLE: గూగుల్ డూడుల్‌గా ‘పానీపూరి’

  • అరుదైన గౌరవం దక్కించుకున్న స్ట్రీట్ ఫుడ్

GOOGLE: ఇదేనిజం, డెస్క్: పానీ పూరి (PANI PURI) అంటే ఇష్టపడని వారుండరు. చిన్నా, పెద్ద అంతా ఈ ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనదేశంలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్(STREET FOOD) గా పానీ పూరీ నిలిచింది. ఈ వంటకం ఇప్పుడు ఓ అరుదైన గౌరవం దక్కించుకున్నది. పానీపూరిపై ప్రపంచ రికార్డు నెలకొల్పి 8 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో గూగుల్‌ డూడుల్‌ను రూపొందించింది. దీంతో పాటు పానీపూరీ ఆకృతులతో ఓ ఇంటరాక్టివ్‌ గేమ్‌ను తీసుకొచ్చింది. 2015 జులై 12న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక రెస్టారెంట్‌ 51 రకాల రుచికరమైన పానీపూరీలను అందించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. దీంతో ఇప్పుడు గూగుల్‌ 8 ఏళ్ల తర్వాత ఈ రికార్డును గుర్తు చేసింది.

Recent

- Advertisment -spot_img