Homeసైన్స్​ & టెక్నాలజీఫ్రీ గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్పుతున్న గూగుల్​

ఫ్రీ గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్పుతున్న గూగుల్​

చిరువ్యాపారస్తులకు ఆన్ లైన్ లో బిజినెస్ ఎలా చేయాలి అనే దానిపైఓ కోర్సును ప్రవేశ పెట్టింది.

ప్రస్తుతం అంతా ఆన్ లైన్ లో బిజినెస్ నడుస్తుండటంతో గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ పై వ్యాపారులకు అవగాహన కల్పించడం కోసం గూగుల్ ఈ కోర్స్ ఉచితంగా అందుబాటులో ఉంచింది.

అలాగే విద్యార్థులు కూడా బేసిక్‌ నాలెడ్జ్‌ కోసం ఈ కోర్స్ ఉపయోగపడుతుంది. ఈ కోర్స్ మొత్తం బేసిక్ ఇంగ్లీష్ లో ఉంటుంది.

ఈ కోర్స్ లో మొత్తం 26 మాడ్యూల్స్ ఉంటాయి, 40 గంటల కోర్స్ ఇది.

ప్రతి మోడ్యూల్ లో మూడు నుంచి ఏడూ వీడియోస్ తో పాటు ప్రతీ వీడియో అర్థమైందో లేదో అని చెక్ యువర్ నాలెడ్జ్‌ అని ప్రశ్నలు కూడా ఉంటాయి.

ప్రతి మాడ్యూల్ ఒక అస్సేస్మెంట్ టెస్ట్ కూడా ఉంటుంది.మొత్తం 26 మాడ్యూల్స్ పూర్తి అవగానే ఫైనల్ టెస్ట్ ఉంటుంది.

ఫైనల్ టెస్ట్ పూర్తి అవగానే గూగుల్ డిజిటల్ ఆన్ లాక్ పేరుతో ఒక సర్టిఫికెట్ కూడా వస్తుంది.

ఈ సర్టిఫికెట్ ని గూగుల్ తో కలిసి ఇంటరాక్టివ్ అడ్వేర్టైజింగ్ బ్యూరో అండ్ ఓపెన్ యూనివర్సిటీ అందిస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img