Homeహైదరాబాద్latest Newsఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి

ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి

ఇదే నిజం, నాగార్జునసాగర్: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో జిల్లా ఆటో యూనియన్ అసోసియేషన్ పిలుపుమేరకు శుక్రవారం ఆటోలు బంద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో ఆటో కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నల్గొండ జిల్లా జనరల్ సెక్రటరీ షేక్ నజీర్
మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు సరైన వ్యాపారం లేక వీధిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారని అన్నారు. జీవన భృతి కోసం నెలకు 15 వేల రూపాయలు ఇచ్చి ఆటో డ్రైవర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బందుకు పిలుపునిచ్చినారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నల్గొండ జిల్లా జనరల్ సెక్రటరీ షేక్ నజీర్, పెద్దవూర మండలం అధ్యక్షులు బంటు పావని, చిన్న అంజయ్య, మాజీ క్యాషియర్ డబ్బా శీను, మాజీ అధ్యక్షులు చాపల శీను, ఆటో స్టాండ్ ఇంచార్జ్ దుబ్బ శీను, శంకర్ నాగరాజు, షేక్ రెహమాన్, దావూద్ అలీ, తదితరులు ఆటో యూనియన్ డ్రైవర్లు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img