తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 3 రోజుల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా అర్జలబాని గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, సన్న రకాల సాగును ప్రోత్సహించేందుకే రూ.500 బోనస్ ఇస్తోందని చెప్పారు. రుణమాఫీ కాని రైతులకు వారం రోజుల్లో పూర్తవుతుందన్నారు.