HomeతెలంగాణGovernor With KCR : ఒకే వేదికపైకి కేసీఆర్, గవర్నర్ తమిళిసై

Governor With KCR : ఒకే వేదికపైకి కేసీఆర్, గవర్నర్ తమిళిసై

Governor With KCR : ఒకే వేదికపైకి కేసీఆర్, గవర్నర్ తమిళిసై

Governor With KCR : చాలా రోజుల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఒకే వేదికపైకి రాబోతున్నారు.

గవర్నర్ వైఖరితో తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు చెబుతున్న కేసీఆర్ గత కొంతకాలంగా రాజ్‌భవన్‌కు దూరంగా ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో నేడు వీరిద్దరూ ఒకే వేదికపైకి రానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తెలంగాణ హైకోర్టు ఐదో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ ఉదయం 10.05 గంటలకు గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణస్వీకారం చేయిస్తారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా హాజరవుతారని తెలుస్తోంది.

కేసీఆర్ గతేడాది అక్టోబరు 11న చివరిసారి అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.

మళ్లీ ఇన్ని నెలలకు ఇప్పుడు హాజరు కాబోతున్నారు.

Recent

- Advertisment -spot_img