Homeహైదరాబాద్latest Newsక్రీడల అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుంది: ప్రభుత్వ విప్

క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుంది: ప్రభుత్వ విప్

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రంలో హిందు సేన యూత్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన DPL క్రికెట్ టోర్నమెంట్ కి సంబందించిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో గురువారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని గెలుపొందిన భార్గవ్ లేవన్ జట్టుకు ట్రోఫితో పాటు నగదు బహుమతిని అందజేశారు,అదే విధంగా రన్నరప్ గా నిలిచిన రంజిత్ లేవన్ జట్టుకు ట్రోఫితో పాటు నగదు బహుమతిని అందజేశారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ సేన యూత్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన జట్టు సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతున్నామని,ఆటలో గెలుపు ఓటములు సహజమని,ఓడిన జట్టు సభ్యులు కృంగి పోకుండా మరల గెలవడానికి మరింత కృషి చేయాలని,ధర్మపురిలో క్రీడాకారుల అభివృద్ధికి ప్రభుత్వం తరపున అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంఘనభట్ల దినేష్ జక్కు రవీందర్ వేముల రాజేష్ లక్ష్మణ్ క్రీడాకారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img