Homeహైదరాబాద్latest NewsGraduate MLC Result: మూడో రౌండ్ కౌంటింగ్ పూర్తి.. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..?

Graduate MLC Result: మూడో రౌండ్ కౌంటింగ్ పూర్తి.. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..?

నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు సంబంధించి మూడు రౌండ్ల లెక్కింపు పూర్తయింది. మూడు రౌండ్ లలో 2,64,216 ఓట్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,878 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
కాంగ్రెస్ – 1,06,234 (తీన్మార్ మల్లన్న)
బీఆర్ఎస్ – 87,356 (రాకేష్ రెడ్డి)
బీజేపీ – 34,516 (ప్రేమెందర్ రెడ్డి)
అశోక్ పాలకూరి – 27,493 (ఇండిపెండెంట్).
కాగా చివరి రౌండ్ అయిన నాలుగో రౌండ్‌లో 48,013 ఓట్లను లెక్కిస్తున్నారు. అయితే అభ్యర్థులు మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలవడానికి దూరంగా ఉన్నారు. ఈరోజు సాయంత్రం 7 గంటల తర్వాత ఎలిమినేషన్ పద్ధతిలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Recent

- Advertisment -spot_img