– తాడేపల్లిలోకి క్యాంప్ ఆఫీసులో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం జగన్
ఇదే నిజం, అమరావతి: రాష్ట్ర అవతరణ వేడులకను బుధవారం ఏపీ ప్రభుత్వం నిర్వహించింది. ఈ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహాలకు జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.