ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనము నందు ఆదివారం నాడు అంతర్జాతీయ ఫాదర్స్ డే సందర్భంగా అధ్యక్షుడు యన్ విటి,పెన్షనర్స్ అధ్యక్షులు టి నరసింహ మరియు సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి అంతర్జాతీయ పితృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అధ్యక్షుడు యన్ విటి మాట్లాడుతూ మన ఆశలే తన ఆయువుగా, మన గెలుపే తన లక్ష్యంగా, మన జీవితాన్ని నిలబెట్టేటందుకు మన కోసం నిత్యం శ్రమించే నిస్వార్థ శ్రామికుడు మన తొలి స్నేహితుడు నానేనని, తనలో ఎంత బాధ ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా ముఖమున చిరునవ్వు నవ్వుతూ తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ కుటుంబం కోసం నిత్యం త్యాగం చేసే గొప్ప వ్యక్తి నాన్నని. నాన్న మనసు మంచు కైనా చల్లనైనదని, మనకు మంచి చెడుల గురించి తెలియజేసి నడక నేర్పే వాడే నాన్నని, అలాంటి నాన్నని ప్రేమించండి ఎందుకంటే మీ ముఖంలో చిరునవ్వు చూడడం కోసం తన సర్వసాన్ని త్యాగం చేసేవాడే కన్నతండ్రని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, పెన్షన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి , ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్, లీగల్ అడ్వైజర్ ఉమా మహేష్,కే పంతులు నాయక్, రాపోలు నిరంజన్ ,భాస్కర్ రెడ్డి, తాళ్ల సురేష్, బత్తుల అమర్ వైయస్ కరుణాకర్, డాన్స్ మాస్టర్ క్రాంతి, కరాటే మాస్టర్ శ్రీను, సింగర్ నల్ల నరసింహ, రాక్ స్టార్ రమేష్ ,డైరెక్టర్ వాసు, పులి కంటి భాస్కర్ ,లింగయ్య, యాదగిరి ,పెద్దలు ,చారి, శ్రీనివాసులు, బుచ్చయ్య, రాములు, జగదీష్, రాజకుమార్ ,డాన్స్ మాస్టర్ జగన్, బన్నీ, కెన్ని ,తపస్విని, సాయిప్రసాద్, అమ్ములు, వర్షిత, గౌతమి ,గణేష్, క్రీడాకారులు కళాకారులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.