Homeహైదరాబాద్latest Newsఘనంగా సీత్ల పండుగ ఉత్సవాలు

ఘనంగా సీత్ల పండుగ ఉత్సవాలు

ఇదే నిజం, గూడూరు: మండల కేంద్రం పరిధిలోని, బ్రాహ్మణపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల, హాము తండలో సిత్లా పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పశుసంపద, పాడి సజావుగా సాగాలని, పంటలు మంచిగా పండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, చెరువులు, కుంటలు వాగులు వంకలు నీటి ప్రవాహంతో పరుగులు తీయాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వన దేవతలను పూజించి, గ్రామంలోని అందరూ వనభోజనాలకు వెళ్లారు. ఇట్టి కార్యక్రమంలో బంజారా మహిళలతో పాటుగా, తండా వాసులు ధారావత్ కీర్యా, దారావత్ శ్రీను, దారావత్ మొగిలి, ధారావత్ నాగేష్, ధారావత్ సురేందర్, ధారావత్ దేవేందర్, ధారావత్ సుందర్, జోగ్య, పూర్ణచందర్, రమేష్, దేవ్ సింగ్, రాములు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img