Homeజిల్లా వార్తలుఎమ్మెల్యే వంశీకృష్ణకు ఘన సన్మానం

ఎమ్మెల్యే వంశీకృష్ణకు ఘన సన్మానం

ఇదేనిజం, అచ్చంపేట: అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణను ఆర్టీసీ కార్మికులు ఘనంగా సన్మానించారు. అచ్చంపేట ఆర్టీసీ డిపోలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్​ ప్రభుత్వం కచ్చితంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పారు. డిపో పరిధిలో ఉన్న ఆర్టీసీ స్థలంలో ప్లాట్లను ఏర్పాటు చేసి ఆర్టీసీ కాలనీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్, సిబ్బంది, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img