Homeహైదరాబాద్latest Newsక్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త.. మరోసారి తలపడనున్న భారత్ - పాకిస్థాన్.. ఒక మ్యాచ్ కాదు.....

క్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త.. మరోసారి తలపడనున్న భారత్ – పాకిస్థాన్.. ఒక మ్యాచ్ కాదు.. ఈ సారి మూడు మ్యాచ్‌లు..!

క్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త… ఈ ఏడాది మళ్ళీ భారత్ – పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లను చూడబోతున్నాము. ఇటీవల ఫిబ్రవరి 23న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో భారతదేశం గెలిచిన విషయం తెలిసిందే. ఆతిథ్య పాకిస్తాన్ జట్టు తన మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయి ఛాంపియన్స్ ట్రోఫీ నుండి నిష్క్రమించిన సంగతి తేలిసిందే. కానీ భారత్ – పాకిస్థాన్ మళ్ళీ ఢీకొనబోతున్నాయి. ఈ ఏడాది ఆసియా కప్‌ను నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) భావిస్తోంది. ఈ టోర్నమెంట్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే అవకాశం ఉంది. ఈసారి ఆసియా కప్‌ను UAE లేదా శ్రీలంకలో నిర్వహించవచ్చు. ఆసియా కప్‌లో భాగంగా భారత్ – పాకిస్థాన్ మధ్య 3 మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆసియా కప్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఒమన్, యుఎఇ మరియు హాంకాంగ్ ఆసియా కప్‌లో పాల్గొంటాయి. అన్ని జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఆసియా కప్‌లో భారత్ – పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉంటాయి. గ్రూప్ స్టేజీలో రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్‌ జరుగుతుంది. రెండు జట్లు తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తే, వారు మళ్ళీ సూపర్-4 దశలో మరో మ్యాచ్ ఆడవచ్చు. టేబుల్లో మొదటి, రెండవ స్థానంలో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. భారత్ – పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో మూడోసారి తలపడవచ్చు.

Recent

- Advertisment -spot_img