ఈ రోజుల్లో చాలా మందిని ఊబకాయం సమస్య వేధిస్తోంది. దీంతో ఎక్కువ మంది గ్రీన్ టీ తాగటం అలవాటు చేసుకుంటున్నారు. గ్రీన్ టీ తాగడం వల్ల త్వరగా బరువు తగ్గుతారని అనుకుంటారు.
అయితే ఎక్కువ కప్పులు గ్రీన్ టీ తాగడం వల్ల నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయంలో గ్రీన్ టీ ఉపయోగపడుతుంది.
గ్రీన్ టీ తాగితే షుగర్ లెవెల్స్ సైతం అదుపులో ఉంటాయి. గ్రీన్ టీ ఎక్కువగా తాగితే కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయి.
కాలేయ సమస్యలు ఉన్నవాళ్లు గ్రీన్ టీ దూరంగా ఉంటే మంచిది.