Homeహైదరాబాద్latest Newsముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

నేనావత్ బాలు నాయక్

దేవరకొండ నియోజకవర్గం లోని ముస్లిం మైనార్టీలకు స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం మైనార్టీ సోదరులు అత్యంత పవిత్రంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకునే పెద్ద పండుగ రంజాన్ అని తెలియజేశారు. సోదర భావంతో హిందూ-ముస్లిం భాయ్ భాయ్ అనే లౌకికవాద తత్వాన్ని కాంగ్రెస్ పార్టీ విడనాడ లేదని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో అన్ని మతాలను, కులాలను సమానంగా చూడడమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. ముస్లిం సోదరుల పండగలకు హిందూ సోదరుల పండుగలకు హిందూ – ముస్లీంలు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒకరి పండగల్లో మరొకరు కలిసి చేసుకునే సాంప్రదాయం దేవరకొండ నియోజకవర్గంలో ఉందన్నారు. ఇది దేవరకొండ ప్రాంత ప్రజలందరికీ గర్వకారణమని తెలియజేశారు.

Recent

- Advertisment -spot_img