Homeహైదరాబాద్latest Newsక్రమశిక్షణతోనే జీవితంలో ఎదుగుదల

క్రమశిక్షణతోనే జీవితంలో ఎదుగుదల

ఇదేనిజం, లక్షెటిపేట : విద్యార్థులు క్రమశిక్షణ ద్వారానే జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారని జెండా వెంకటాపూర్ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ యశోదర పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని జెండా వెంకటాపూర్ ప్రభుత్వ పాఠశాల వీడ్కోలు వేడుక సందడిగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు క్రమశిక్షణ, దేశభక్తి భావాలతో మెలుగుతూ ఉన్నతమైన స్థానాలకు చేరుకొని, తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఇదే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది వ్విద్యార్థులు నేడు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారన్నారు. విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించడం ద్వారా మంచి అవకాశాలు దక్కుతాయన్నారు. వీడ్కోలు వేడుకలో విద్యార్థులు రూపొందించిన సాంస్కృతిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాయి. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img