Homeసినిమా‘గన్స్​ అండ్ గులాబ్స్​’సీజన్​–2 రెడీ

‘గన్స్​ అండ్ గులాబ్స్​’సీజన్​–2 రెడీ

ఓటీటీ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్ వేదిక‌గా ఈ ఏడాది వ‌చ్చిన వెబ్ సిరీస్ ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’. రాజ్‌ అండ్ డీకే కాంబో తీసిన ఈ వెబ్‌సిరీస్​లో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ న‌టుడు రాజ్ కుమార్ రావు లీడ్ రోల్స్‌లో న‌టించారు. గ్యాంగ్‌స్ట‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన ఈ వెబ్ సిరీస్ ఈ ఏడాది ఆగ‌స్టు 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయి మంచి టాక్​ తెచ్చుకుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి మేక‌ర్స్ సీజ‌న్– 2ను అనౌన్స్ చేశారు. ‘ఉత్త చేతుల‌తో రావ‌ట్లేదు. ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’ సీజ‌న్ 2’తో వ‌స్తున్నాం అంటూ మేకర్స్ ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img