Homeహైదరాబాద్latest NewsGuntur Karam : థియేట్రికల్ రైట్స్​లో సరికొత్త రికార్డ్​

Guntur Karam : థియేట్రికల్ రైట్స్​లో సరికొత్త రికార్డ్​

సూపర్ స్టార్ మహేశ్​ బాబుతో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న మాస్​ యాక్షన్ ఎంటర్​టైనర్ గుంటూరు కారం. వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల రిలీజైన ఫస్ట్​ సింగిల్ ‘దమ్ మసాలా’కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఫుల్ మాస్​గా ఉండబోతున్నట్లు ఈ పాటను వింటే తెలుస్తోంది. రిలీజ్​కు 2 నెలల టైమ్​ ఉండటంతో ‘గుంటూరు కారం’థియేట్రికల్ రైట్స్​ బిజినెస్​ను మేకర్స్ షురూ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సూపర్​గా బిజినెస్ చేస్తోంది. దాదాపు రూ. 115 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరుగుతున్నట్లు సమాచారం. దీనిపై తొందరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్​ వేగంగా జరుగుతోంది. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఖలేజా తర్వాత మళ్లీ మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్​తో పాటు నార్మల్ ఆడియెన్స్ సైతం భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.​

Recent

- Advertisment -spot_img